ప్రతి విద్యార్థి పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కలిగి ఉండాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్ లో విద్యార్థులతో ఆయన మాట్లాడారు. చెట్లను పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణ దినోత్సవం లో భాగంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు ఆయన అభినందించారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగం తగ్గించాలన్నారు. రాలు పరిశుభ్రంగా ఉంచుకొని మరుగుదొడ్ల వినియోగం చేయాలన్నారు. దోమలకు ఆవాస కేంద్రాలైన మురుగుంటలు చెత్తాచెదారాన్ని లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దోమల నివారణ ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఉందన్నారు. కలుషితం అవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు కోట వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.