బాపట్ల పట్టణంలోని 31 వ వార్డు ప్రజల కరెంటు కష్టాలు అంతా ఇంత కాదు గడిచిన వారం రోజులుగా విజయలక్ష్మి పురం చర్చి వద్ద గల ఎస్ ఎస్ 64 ట్రాన్స్ఫార్మర్ సరిగా పనిచేయకపోవడంతో గడచిన రాత్రి 15 సార్లు కరెంటు పోవడం జరిగింది. లో వోల్టేజ్ రావడంతో కరెంట్ సరిగా లేక ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. పగలు లేదు రాత్రి లేదు ఎప్పుడు బడితే అప్పుడు కరెంట్ పోవడం కరెంటు రావడానికి సుమారు నాలుగు గంటల నుండి ఐదు గంటలు సమయం పట్టడం వల్ల ఈ ప్రాంతంలో చిన్న పెద్దవారు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. ఈ విషయమై చాలాసార్లు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళిన లాభం లేకుండా పోయింది. విద్యుత్ అధికారులు సత్వర చర్యలు తీసుకొని ఈ కరెంట్ కష్టాల నుండి గట్టెక్కించవలసిందిగా ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు.