అనకాపల్లి జిల్లా ఎస్పీకార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి 30 ఫిర్యాదులు లభించినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఈ స్పందన కార్యక్రమానికి 30 ఫిర్యాదు లలో ఆస్తి తగాదాలు మరియు కుటుంబ కలహాలు తదితర అంశాలపై ఫిర్యాదులు స్వీకరించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ, అదనపు ఎస్పీ (పరిపాలన) బి. విజయభాస్కర్ పాల్గొన్నారు.