చైన్నె నుంచి షాలిమర్ వైపుగా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రెండురోజుల అనంతరం పట్టాలెక్కింది. ఒడిశాలో ప్రమాదం జరిగిన ప్రదేశంలో రైల్వే ట్రాక్‌ను పునరుద్ధరించారు. చైన్నె – షాలిమర్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ను మళ్లీ ప్రారంభించారు. దీంతో ఈ రైలు సోమవారం ఉదయం చైన్నె సెంట్రల్ రైల్వేస్టేషన్ నుంచి 10.45 గంటలకు బయలు దేరింది. విజయవాడ, విశాఖ మీదుగా బాలాసోర్ వైపుగా కోలకతాలోని షాలిమర్‌కు మంగళవారం ఉదయం చేరుకోనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa