విశాఖ ఉమ్మడి జిల్లాల్లో పలువురు తహసీల్దార్లకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు విశాఖ కలెక్టర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. బదిలీ అయిన అధికారులు తక్షణమే తమ కొత్త స్థానాల్లో చేరాలని ఉన్నతాధికారులు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్ అండ్ నోడల్ అథారిటీ ఫర్ సర్వీసెస్, ఈర్స్ట్‌వైల్ విశాఖ జిల్లా పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీసీఎల్‌ఏ ఆదేశాల మేరకు పాలనా సౌలభ్యం కోసం ఈ బదిలీల్ని జరిపినట్టు అధికారులు పేర్కొన్నారు.
అనకాపల్లి కలెక్టరేట్‌లో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న సీహెచ్ చంద్రశేఖర్‌రావును అనకాపల్లి ఆర్‌డీవో కార్యాలయంలోని డీఏవోగా బదిలీ చేశారు. అనకాపల్లి తహసీల్దార్‌గా పని చేస్తున్న ఎ. శ్రీనివాస రావును కలెక్టరేట్‌లోని అడ్మిన్ విభాగ సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. కోటవురట్లలో తహసీల్దార్‌గా పని చేస్తున్న వైఎస్‌వీవీ ప్రసాదరావును గొలుగొండ తహసీల్దార్‌గా బదిలీ చేశారు. రీసర్వే ఓఎస్‌డీగానూ ఆయన డెప్యూటేషన్‌పై పనిచేయాల్సి ఉంటుంది. అనకాపల్లి ఆర్‌డీవో కార్యాలయ డీఏవోగా పని చేస్తున్న పీవీఎల్‌ఎన్ గంగాధర్‌రావును అనకాపల్లి తహసీల్దార్‌గా వేశారు. నాతవరం తహసీల్దార్ పి. కనకారావును పరవాడ తహసీల్దార్‌గా నియమించారు. పరవాడ తహసీల్దార్ పి. ప్రకాశరావును మునగపాక తహసీల్దార్‌గా నియమించారు. బుచ్చయ్యపేట తహసీల్దార్ ఎస్‌వీ అంబేడ్కర్‌ను నక్కపల్లి తహసీల్దార్‌గా బదిలీ చేశారు. రోలుగుంట తహసీల్దార్ కె. వెంకటేశ్వరరావుకు బుచ్చయ్యపేట తహసీల్దార్‌గా స్థాన చలనం కలిగించారు.
అల్లూరి జిల్లాలో తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఎస్. జానకమ్మను కోటవుటర్ల తహసీల్దార్‌గా వేశారు. ల్యాండ్ అక్విజేషన్ (ఎల్‌ఏ) స్పెషల్ తహసీల్దార్ (విశాఖ రెవెన్యూ డివిజన్) జె. తారకేశ్వరిని రోలుగుంట తహసీల్దార్‌గా నియమించారు.