ఉక్కు పరిరక్షణ కొరకు ఉక్కు గుర్తింపు యూనియన్ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం బుధవారం ఉక్కు అంబెడ్కర్ కలక్షేత్రం లో నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఉక్కు ఉద్యోగులు, నిర్వశితులు, మహిళలు, యువకులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమం కి ముఖ్య అతిధిగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, జీవీఎంసీ 87వార్డు కార్పొరేటర్ బోండా జగన్నాధం( జగన్) పాల్గొన్నారు. రక్తదానం చేసిన దాతలు కి ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం మించిన దానం లేదని ప్రాణాపాయ స్థితిలో ఉండేవాళ్ళకి రక్తం ఎంతో అవసరమని ఎన్నో ప్రాణాలు సరైన సమయంలో రక్తం అందక మృతి చెందిన సంఘటనలు చాలా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న ఉక్కు డైరెక్టర్ పర్సనల్, సి. ఐ. యస్. యఫ్ కమెండెంట్ హనీఫ్, గుర్తింపు యూనియన్ నాయకులు డి. ఆదినారాయణ, కే. ఎస్. ఎన్ రావు, నరేష్, మాశేన్ రావు, నర్సింగ్ రావు, ఇంటక్ నాయకులు మంత్రి రాజశేఖర్, పలు యూనియన్ అధ్యక్షులు, ఉక్కు కర్మాగారం లో పలు డిపార్ట్మెంట్ల విభాగధిపతులు, ఉక్కు ఉద్యోగులు, మరియు ఉక్కు ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, మహిళలు తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొని రక్తదానం చేశారు.