ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. బుధవారం గరుగుబిల్లి మండలం ఉల్లిభద్రలో రైతులకు వరి విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa