పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం సీపీఎస్ ను రద్దు చేస్తూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
జీపీఎస్‌తో విస్తృత ప్రయోజనాలు : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పెన్షన్ పథకం (జీపీఎస్) అనేక రకాల ప్రయోజనాలను కలిగి ఉంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) కంటే ఇదే మెరుగైన పథకం అని ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ పథకం పెన్షన్‌కు మరింత హామీని అందిస్తుంది. దీని అమలు కూడా సీపీఎస్ మాదిరిగానే ఉంటుంది. ఉద్యోగి 10 శాతం ఇస్తే, దానికి సమానంగా ప్రభుత్వం ఇస్తుంది.పదవీ విరమణకు ముందు ప్రాథమిక జీతం యొక్క చివరి జీతంలో 50% పెన్షన్‌గా పొందబడుతుంది. జీపీఎస్ ద్వారా పొందే పెన్షన్ సీపీఎస్ కంటే 150 శాతం ఎక్కువ.
అలాగే ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకోసారి ప్రకటించే డీఏలను పరిగణనలోకి తీసుకుంటే ఏడాదికి రెండు డీఆర్‌లు ఇస్తారు.
అంటే రిటైర్ అయిన వ్యక్తి... చివరి నెలబేసిక్ జీతం రూ.1 లక్ష ఉంటే.. అందులో రూ.50వేలు పెన్షన్‌గా వస్తుంది. ఏడాదికి 2 డీఆర్‌లతో కలుపుకుని ఇది ప్రతిఏటా పెరుగుతూ పోతుంది...
62 సంవత్సరాలకు రిటైర్ అయ్యే వ్యక్తి మరో ఇరవై ఏళ్ల తర్వాత అంటే.. రిటైర్ అయిన ఆ ఉద్యోగికి 82 ఏళ్లు వచ్చేసరికి జీపీఎస్‌ద్వారా పెన్షన్ రూ. 1,10,000 కి చేరుతుంది...
దీంతో రిటైర్ అయిన ఉద్యోగి జీవన ప్రమాణాలను కాపాడినట్టు అవుతుంది...
వారి జీవనవిధానానికి దెబ్బలేకుండా, సంతోషంగా ఉండేలా ఈ రక్షణ చర్యలను జీపీఎస్‌లో తీసుకున్నారు...
సీపీఎస్‌లో ఇలాంటి వెసులుబాటే లేదు.... కొన్ని రాష్ట్రాల్లో తిరిగి ఓపీఎస్ తీసుకువస్తున్నామని ఆయా ప్రభుత్వాలు వెల్లడించాయి. కాని, ఇది అమల్లోకి రాలేదు. ఏంచేయాలా? అని మల్లగుల్లాలు పడుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వానికీ, ఉద్యోగులకు ఉభయతారకంగా మేలు జరిగేలా అన్ని రకాల సమతుల్యతను పాటించేలా ఈ నిర్ణయం.
2070 నాటికి జీపీఎస్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన డబ్బు క్రమంగా పెరుగుతూ అప్పటికి రూ.1,33,506 కోట్లుకు చేరుకుంటుంది. ఇందులో రూ.1,19.520 కోట్లు ప్రభుత్వమే, బడ్జెట్ నుంచి భరించాల్సి వస్తుంది.
దీంతో పాటు కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వల్ల వేలాది మందికి లబ్ధి చేకూరనుంది. ఆర్టీసీ, పాలిటెక్నిక్, విద్య, వైద్యం, వైద్యం వంటి రంగాల్లో కాంట్రాక్టు పద్ధతిలో పెద్దసంఖ్యలో సిబ్బంది కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తుండగా వారి పట్ల జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి వారి సర్వీస్ రెగ్యులర్ చేయడం జరిగింది.