పెళ్లికి వెళుతూ ముగ్గురు యువకులు మృతి చెందారు. దీంతో మృతుల స్వగ్రామమైన శ్రీరాంపురం శోకసంద్రంగా మారింది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తమవుతుంది. మృతి చెందిన ముగ్గురు యువకులు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలోని శ్రీరాంపురం గ్రామానికి చెందిన శెట్టి బలిజ కులస్తులు.
ఈ ప్రమాద ఘటన కాకినాడ జిల్లా శ్రీరాంపురం సమీపంలోని తొండంగి మండలం ముసిడివాడ గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. మృతి చెందిన ముగ్గురు యువకులు 20 నుంచి 22 సంవత్సరాల వయసు వయసు నిండిన వారు. గ్రామస్తుల సమాచారం మేరకు సంఘటన వివరాలు..శ్రీరాంపురం గ్రామానికి చెందిన స్నేహితులు ముగ్గురు పసుపులేటి దుర్గాప్రసాద్ (22) కాకర వీరబాబు( 21) పోలవరపు కిరణ్ కుమార్( 22) స్నేహితుని పెళ్ళికి వెళ్లేందుకుగాను ఓకే మోటార్ సైకిల్ పై బయలుదేరి వెళ్లారు.
తొండంగి మండలం ముసిడివాడ గ్రామం వద్ద వీరు వెళుతున్న టు వీలర్ బండికి ట్రాక్టర్ అడ్డంగా రావడంతో, ట్రాక్టర్ ను ఢీకొని ముగ్గురు యువకుల్లో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో యువకుడు చికిత్స నిమిత్తం కాకినాడ ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. ప్రమాదం భారీగా జరగడంతో యువకులు నుజ్జునుజ్జు అయ్యారు. మృతి చెందిన యువకుల్ని పోస్టుమార్టం నిమిత్తం తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం చెందడంతో ఆ గ్రామం అంతా శోకసంద్రంగా మారింది. మృతి చెందిన యువకులు తల్లిదండ్రులకు ఒక గాన ఒక పిల్లలు వీరి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా దుర్మరణం చెందారన్న వార్త విని తల్లిదండ్రులు సొమ్మసిల్లి పోయారు. పెళ్లికి వెళితే చావు ఎదురు వస్తుందని కలలో కూడా ఊహించుకోలేదని తల్లిదండ్రుల పెడుతున్న రోదన చూపార్లను కన్నీళ్లు తెప్పించింది. అతివేగంగా టు వీలర్ అందులోనూ ముగురు యువకులుతో నడపడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని సంఘటన ప్రదేశాన్ని సందర్శించిన పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలకు శవ పంచ నామాలు నిర్వహించి పోస్టుమార్టం తరలించారు.