కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తమిళనాడు వెళ్లనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం చెన్నై చేరుకుంటారు. ఈ సందర్భంగా ఆయనతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్), మాజీ సీఎం ఒ.పన్నీర్‌సెల్వం సమావేశమవుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. అలాగే అన్నాడీఎంకేకు దూరమైన పన్నీర్‌సెల్వంతో కూడా చర్చించే అవకాశముంది. అది ముగిశాక దక్షిణ చెన్నై నియోజకవర్గ నేతలతో భేటీ కానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa