స్థానిక ఈ ఎన్ టి ఆస్పత్రి రోడ్డులోని కేంద్ర ప్రభుత్వ వెల్ నెస్ సెంటర్ లో కొత్తగా ఏర్పాటు చేసిన ఆయుర్వేదం, హోమియోపతీ విభాగాలను శనివారం ప్రారంభించారు. ఈ విభాగాలను చీఫ్ మెడికల్ ఆఫీసర్ టి సీ హెచ్. కోటేశ్వర రావు, డాక్టర్ శ్యామ్ కిశోర్ బాబు ప్రారంభించారు. ఇక్కడ గుప్తేశ్వర్ మిశ్రా ఆయుష్, అనిషద్ హోమియోపతి సేవలు అందిస్తారు. ఈ వెల్ నెస్ సెంటర్ ను 2017 లో ప్రారంభించారు. ఈ కేంద్రం పరిధిలో 13 వేల కార్డులు వుండగా, 30 వేల మంది లబ్ధిదారులకు వైద్య సేవలు అందిస్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నగరంలో చిన వాల్తేరు, దాబాగర్డన్స్ ప్రాంతాల్లో కేంద్రాలు ఉన్నాయి అని గుర్తు చేశారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు వైద్య సేవలు అందిస్తారు అన్నారు. రోజుకి 300 మంది వరకు ఓపీ విభాగంలో వైద్యం కోసం వస్తారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత్ బీఎస్ ఎన్ ఎల్ పింఛనర్ల సంఘం, సి జీ హెచ్ ఎస్ లబ్ధిదారుల వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ సంఘం సభ్యులు, నాయకులు కే. రవిబాబు, కే వి డి స్వామి, బీ డీ రాజు తదితరులు పాల్గొన్నారు.