న్యాయవాదుల కోసం పరిరక్షణ చట్టం చేయాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ( ఐ ఎ ఎల్) జాతీయ కార్యదర్శి సురేష్ కుమార్ కోరారు. ఆయన డాబాగార్డన్స్ ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతి మూడేళ్లకు ఒకసారి జరిగే జాతీయ మహాసభలు కేరళలో జరిగాయి అన్నారు. తమ సంఘం 1983 లో ఆవిర్భవించింది అని గుర్తు చేశారు. తమ సంఘం నాయకులు పలు సమస్యలపై దృష్టి సారిస్తున్నారు అన్నారు. కొత్త కార్యవర్గం ఎన్నిక జరిగింది అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి తాను ఎన్నిక అయ్యాను అన్నారు. రాష్ట్ర మహా సభలు రాజమండ్రి లో జరిగాయి అని గుర్తు చేశారు. అంతర్జాతీయ సంఘంలో దేశం నుంచి ఐ ఏ ఎల్ మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుంది అన్నారు. న్యాయ వాదులకు స్టీఫెన్డ్, డెత్ బెనిఫిట్, మెడికల్ రీిఇంబర్స్మెంట్ మొత్తాలు పెంచాలని డిమాండ్ చేశారు. పలు కేసులు లో న్యాయవాదులకు బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం మాదిరిగానే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా రూ. 200 కోట్లు బార్ కౌన్సిల్ కి కార్పస్ ఫండ్ కింద ఇవ్వాలని కోరారు. సంస్థ రాష్ట్ర కార్య వర్గ సభ్యుడు ఐ ఎం అహ్మద్ మాట్లాడుతూ, జడ్జిలుతో పాటు న్యాయం కోసం పని చేస్తున్న న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరారు. కొన్ని కేసుల్లో వాదిస్తున్న లాయర్లకు రక్షణ వుండడం లేదని వాపోయారు. ఇందు కోసం న్యాయవాదుల పరిరక్షణ చట్టం వుండాలని కోరారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశ పెట్టాలి అని కోరారు. రాజ్యాంగం ప్రకారం పేదలకు న్యాయం చేయడానికి లాయర్లు కృషి చేస్తున్నారు అని గుర్తు చేశారు. లాయర్లు పలు ప్రజా ప్రయోజన పిటిషన్లు దాఖలు చేస్తున్నారు అని తెలిపారు. మీడియా సమావేశంలో సంస్థ నేతలు ఎం ఎన్ ఎన్ భగవతి, రాష్ట్ర కార్యదర్శి అజయ్ కుమార్, జాన్సి, సుబ్బారావు, పాల్గొన్నారు.