గుంటూరు నగరంలోని వైద్య కళాశాలలో పనిచేస్తున్న సహాయ ఆచార్యుల్లో 13 మందిని రాష్ట్రంలోని వివిధ వైద్య కళాశాలలకు బదిలీ చేస్తూ రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు నరసింహం ఉత్తర్వులు శనివారం జారీ చేశారు. అదేవిధంగా వివిధ వైద్య కళాశాలల నుంచి 13 మంది గుంటూరుకు మార్చారు. సాధారణ బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయినందున కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలల్లో 3 పనిచేసేందుకు ఆసక్తి ఉన్న బోధనానిపుణుల నుంచి శనివారం దరఖాస్తులను స్వీకరించారు.