జగన్ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని తెలుగుదేశం పార్టీ జోన్ 2 పరిశీలకుడు ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. తాడేప ల్లిగూడెం గమిని ఫంక్షన్ హాలులో పార్టీ ఆధ్వర్యంలో రైతు సమస్యలకు మద్దతుగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జి అధ్యక్ష తన ఆదివారం జోన్–2 రైతుల సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయినా సీఎం జగన్‌కు కనీసం పరామర్శించే ప్రయత్నం చేయకపోవడం దారుణ మన్నారు. 34 లక్షల టన్నుల ధాన్యం పండగా ప్రభుత్వం 14 లక్షల టన్నులే కొనుగోలు చేయడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa