రాబోయే ఎన్నికలలో టీడీపిదే అధికారం అని, ఎవరూ అధైౖర్యపడకండి.. అండగా ఉంటామని మంత్రాలయం టీడీపీ ఇన్చార్జి తిక్కారెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని టీడీపీ రాష్ట్ర రైతు సంఘం అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మస్కి రంగన్న, మస్కి ఓబులేష్, పెద్ద నాగప్ప, రామకృష్ణ, లక్ష్మయ్య, మల్లికార్జున, రాముడు, వీరేష్, లక్ష్మి, తిక్కమ్మ, రామలక్ష్మితో పాటు 65 కుటుంబాలు సూమారు 150 మందికి పార్టీ కండువా కప్పి వైసీపీ నుంచి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ మేనిఫెస్టోలో రైతులకు, మహిళలకు ఇచ్చిన హామీలు నచ్చి పార్టీలోకి చేరారన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ బసలదొడ్డి ఈరన్న, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు ఏసేబు పాల్గ్గొన్నారు.