సైబర్ నేరాలపై ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని, అపరిచితుల మెస్సేజ్‌లకు స్పందించవద్దని ఏలూరు ఎస్పీ మేరీ ప్రశాంతి సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చి న ఫిర్యాదులను స్వీకరించి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కైకలూరు నుంచి ఒక మహిళ అత్తింటివారి వేధింపులపై చర్యలు తీసు కోవాలని కోరింది. నూజివీడు మండలం మర్రిబండ వ్యక్తి ఉద్యోగం ఇప్పి స్తానని ఐదు లక్షలు తీసుకుని మోసగించారని ఫిర్యాదు చేశారు. జంగారెడ్డిగూడెం మండ లం దేవుపల్లి పంచాయతీకి చెందిన వ్యక్తి లక్కవరం యూనియన్ బ్యాంకులో తన ఖాతా నుంచి రూ.5 లక్షల ట్రాన్స్‌ఫర్ చేస్తానని చెక్కు తీసుకుని మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం నుంచి ఒక మహిళ వచ్చి తన అత్తింటి వారు కట్నం కోసం వేధిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. జిల్లా పోలీసు కార్యాలయంలో మొత్తం 35 ఫిర్యాదులు రాగా విచారణ జరిపి న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.