రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన మరోసారి రద్దయింది. తమిళనాడులోని గిండిలో రూ.240 కోట్లతో ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించారు. 1000 పడకల సామర్థ్యంతో నిర్మించిన ఈ ఆస్పత్రిని జూన్ 15న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆస్పత్రిని ప్రారంభించినున్నారు.
వాస్తవానికి ఈ నెల 5వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడు ఆమె విదేశీ పర్యటనలో ఉండటంతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. ఆ తర్వాత ఈ నెల 15న ప్రారంభోత్స తేదీని ఫిక్స్ చేశారు. కానీ రాష్ట్రపతి రాకపోవడంతో సీఎం ఎంకే స్టాలిన్ ఆస్పత్రిని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.