ఎన్టీఆర్ రూ.2కే కిలో బియ్యం ఇస్తే ఆయన స్ఫూర్తితో రూ.2కే భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని మాజీ మంత్రి సిహెచ్.అయ్యన్నపాత్రుడు అన్నారు. నర్సీపట్నం పట్టణంలోని ప్రాంతీయ ఆస్పత్రి ఎదు రుగా పాత అన్నక్యాంటీన్ సమీపంలో సోమవారం సంచార అన్నక్యాంటీన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలలో చంద్రబాబునాయుడు రూ.5కే భోజనం పెట్టారన్నారన్నారు.ప్రాంతీయ ఆస్పత్రి దగ్గర పెడితే బాగుంటుందని అప్ప ట్లో ఆలోచించి ఇక్కడ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశామని చెప్పారు. కానీ జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అన్నక్యాంటీన్ తీసేశారని మండిపడ్డారు. తిరిగి అన్నక్యాంటీన్ పెట్టాలన్న ఆలోచన వచ్చి సంచార అన్నక్యాంటీన్ ద్వారా సంవత్సరం పాటు రూ.2కే భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. 2016 నుంచి ప్రతి సోమవారం ఇక్కడి మరిడి మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద అన్నసమారాధన జరుపుతున్నామని, ప్రతి మంగళవారం కళాసీ కాలనీలో కూడా తన తండ్రి వరహాలదొర పేరు మీద అన్నదానం చేస్తున్నామని తెలిపారు. ఈ రెండు వారాలు మినహా, మిగిలిన రోజుల్లో సంచార అన్నక్యాంటీన్ ద్వారా రెండు రూపాయలకే భోజం పెట్టనున్నామన్నారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ క్యాంటీన్ నిర్వహించాలని కమిటీ సభ్యులకు అయ్యన్న సూచించారు. ఈ కార్యక్ర మంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, 25వ వార్డు కౌన్సిలర్ చింతకాయల రాజేశ్, పలువురు టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.