నీట్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. మొత్తం 20,38,596 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కాగా 11,45,976 మంది అర్హత సాధించారు. తమిళనాడుకు చెందిన ప్రభంజన్, ఏపీకి చెందిన వరుణ్ చక్రవర్తి మొదటి ర్యాంక్ సాధించారని ఎన్టీఏ వెల్లడించింది. ఈ ఇద్దరు 720 మార్కులకు 720 మార్కులు సాధించారని వెల్లడించారు. విద్యార్థులు తమ ఫలితాలను https://neet.nta.nic.in/ ద్వారా చూసుకోవచ్చు.
ఈడబ్ల్యూఎస్ విభాగంలో ఏపీ విద్యార్థి వైఎల్ ప్రవధన్ రెడ్డి రెండో ర్యాంక్ సాధించాడు. అలాగే.. ఏపీకి చెందిన కె.యశశ్రీ ఎస్సీ కేటగిరీలో రెండో ర్యాంకు సాధించింది. నీట్‌లో అత్యధికంగా అర్హత సాధించిన అభ్యర్థులు యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్‌లకు చెందినవారేనని ఎన్‌టీఏ వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం 11,45,976 మంది అభ్యర్థులు అర్హత సాధించగా, ఏపీ నుంచి 42,836 మంది, తెలంగాణ నుంచి 42,654 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.