వచ్చే నెలలో జరగనున్న శాసన మండలి సమావేశాల్లో సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కె.లక్ష్మణరావు చెప్పారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సర్దుబాటు పేరుతో వైసీపీ ప్రభుత్వం పెద్ద మొత్తంలో చార్జీలు పెంచిందని విమర్శించారు. సమావేశంలో టాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సాంబిరెడ్డి, కార్యదర్శి ఆంజనేయులు, ఎంఎ్‌సఎంఈ అధ్యక్షుడు పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.