టీడీపీ యువనేత నారాలోకేష్ చేపడుతున్న యువగళం పాదయాత్రపై బుధవారం మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లాలో యువగళం పాదయాత్ర అట్టర్ ప్లాఫ్ అని టీడీపీ వారే మాట్లాడుకుంటున్నారని చెప్పారు. జిల్లాలో 24లక్షల మంది ఓటర్లు అండగా అందులో కనీసం 24వేల మంది కూడా రాలేదన్నారు. సెండాఫ్ ఇవ్వడానికి, ఆహ్వానించడానికి వచ్చిన వారంతా కలిపినా రెండుమూడు వేల మంది కూడా లేరన్నారు. లోకేశ్ పాదయాత్రకి లక్ష్యం లేదని, అది పాదయాత్రలా కాదు, వాకింగ్ చేస్తున్నట్టు ఉందని విమర్శించారు.