కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం గిడజాం గ్రామంలో మంగళవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో గ్రామశివారు 135 ఏళ్ల కలిగిన మర్రి చెట్టు నేలకొరిగింది. ఎండకు చెట్టుకింద సేదతీరుతున్న దివ్యాంగుడు పులుగు రాజులు మృతిచెందాడు. దివ్యాంగుడు కావడంతో గాలులు వీస్తున్న సమయంలో బయటకు వెళ్లలేకపోయాడు. దీంతో చెట్టు మీద పడి మృతి చెందినట్టు బంధువులు తెలిపారు.