టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువగళం పాదయాత్ర మంగళవారం రాయలసీమలో పూర్తయి కోస్తాలోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోకి అడుగుపెట్టింది. 125వ రోజు పీపీ కుంట విడిది కేంద్రం నుంచి ప్రారంభమైన యాత్ర.. 3కి.మీ నడవగానే సాయంత్రం 6.15గంటలకు రాయలసీమలో పూర్తయి.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా రాయలసీమకు చెందిన టీడీపీ నేతలు అమరనాథ్‌రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి, ఆర్.శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, పుత్తా నరసింహారెడ్డి తదితరులు లోకేశ్‌కు వీడ్కోలు పలికారు.