బిపర్ జోయ్ తుఫాన్ గుజరాత్ తీరాన్ని వణికిస్తోంది. దీని తీవ్రత అధికంగా ఉంటుందని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాలని NDRF అసిస్టెంట్ కమాండెంట్ నిఖిల్ ముధోల్కర్ విజ్ఞప్తి చేశారు. తుఫాన్ ప్రభావంతో ప్రస్తుతం తీర ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 70 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నట్లు చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో సైనిక బలగాలను మోహరించామని చెప్పారు.