యూపీలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత సంచలన సీఎం యోగీ ఆదిత్యనాథ్ సంచలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో తాజాగా మరో నిర్ణయం ప్రకటించారు. రాష్ట్రంలో ఆధ్యాత్మిక నగరంగా రూపుదిద్దుకుంటున్న అయోధ్య పవిత్రతను కాపాడేందుకు వీలుగా ఇకపై అక్కడ మద్యం, మాంసం వినియోగంపై నిషేధం విధించాలని నిర్ణయించారు. ఈవిషయాన్ని అయోధ్య అభివృద్ధి కార్యక్రమాల సమీక్షా సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించారు. రెండు రోజుల అయోధ్య పర్యటనలో భాగంగా గురువారం బికాపూర్ ప్రాంతంలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగసభలో యోగీ ప్రసంగించనున్నారు.