ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పండగ చేసుకునే ప్రకటనను ఏపీ సీఎం జగన్ చేశారని తెలుస్తోంది. ప్రభుత్వంలో నలుగురు సలహాదారుల పదవీకాలాన్ని మరికొంత కాలం పొడిగించనున్నారని తెలుస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్ , అజయ్ కల్లాం, శామ్యూల్ పదవీ కాలాన్ని పొడిగించేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. సలహాదారులుగా నియమించినప్పుడు వీరి పదవీకాలం మూడేళ్లుగా ప్రభుత్వం పేర్కొంది. ఆ తర్వాత సలహాదారులందరికీ ఏకరూపత కోసమంటూ రెండేళ్లకు కుదించింది. కానీ ఆసక్తికరంగా వీరి పదవీకాలాన్ని పొడిగిస్తూనే ఉంది. ఈసారి కూడా పొడిగిస్తే మూడోసారి అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa