పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ ఆఫీస్ అవినీతి నిలయంగా మారింది. లేని ఇంటి పట్టాలై అనుభవ మరి స్వాధీన ధ్రువీకరణ పత్రాలు ముసుగులో, రూ 2000 మొదులుకొని అంతకు మించి వేల లక్షల రూపాయల్లో అధికారులు అవినీతికి అమ్ముడుపోతున్నారు. ప్రతి, రెవెన్యూ ధ్రువీకరణ పత్రంపై
సంతకాలు చేసి సీలు వేసి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కు సహకరిస్తున్నారు. రిజిస్ట్రేషన్ గా చేయించుకుని నకిలీ డాక్యుమెంట్లతో అనేకమంది పేదలను మోసగిస్తూ అక్రమార్కులు లక్షల రూపాయలు కాజేస్తున్నారు. వారికి అధికారులు అండగా నిలుస్తున్నారు. ఇటీవల పలమనేరు పట్టణ సమీపం బొమ్మ దొడ్డి రెవిన్యూ పరిధిలో ఓ ఇంటి పట్టా సర్వేనెంబర్ 100/1, 100/1ఏ, 100/1బీ, 100/1సీ, డివిజన్ వారీగా ఒకే స్థల ఇంటి స్థలంపై నాలుగు పర్యాయములు ఆర్వో సర్టిఫికెట్ ద్వారా రిజిస్ట్రేషన్ జరిగాయి 90వేలు నుండి 2, లక్షల75 వేల రూపాయలకు నలుగురు కు దశల వారీగా రెవెన్యూ సర్టిఫికెట్ ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి.
ఈ విషయమై స్థానికంగా పలమనేర్ పోలీస్ స్టేషన్లో నకిలీ ధ్రువీకరణ పత్రంపై బాధితులు ఫిర్యాదు కూడా చేశారు. మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని పోలీసులు ఆశ్రయించారు. ప్రస్తుతం ఇదే కేసు పలమనేరు పోలీస్స్టేషన్లో దర్యాప్తులో ఉంది. ఇలాంటివి మున్సిపాలిటీ పరిధిలో అనేకం జరిగాయని సమాచార హక్కు చట్టం ద్వారా బయలు పడింది. అవినీతి అక్రమాలు నేపథ్యంలో మున్సిపాలిటీ రెవిన్యూ స్థాయి ఉద్యోగులు కొమ్ముకాస్తున్న అధికారులపై అవినీతి నిరోధిక శాఖ
స్పందించినట్లయితే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ సమాచార హక్కు చట్టం పరిరక్షణ సమితి సభ్యులు అధికారులకు విజ్ఞప్తి చేశారు.