నెల్లూరు: కలువాయి మండలం కోటూరుపల్లి చెరువు సమీపంలో అక్రమ రవాణాకు సిద్దంగా ఉంచిన 10 ఎర్రచందనం దుంగలు అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం అక్రమ తరలింపు సమాచారాన్ని అందుకున్న అధికారులు దాడులు చేసి సుమారు రూ.10 లక్షలు విలువచేసే ఎర్రచందనంతో సహా కారును సీజ్ చేశారు. స్మగ్లర్లు పరారైనట్లు అధికారులు వెల్లడించారు.