తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయం సమీపంలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగింది. లావణ్య ఫోటో ఫ్రేమ్స్‌లో మంటలు అంటుకుని మూడంతస్థుల భవనానికి వ్యాపించాయి. ఫోటో ల్యామినేషన్ తయారీ కేంద్రం కావడంతో రసాయనాల వల్ల మంటలు మరింతగా విస్తరించాయి. దీంతో సమీపంలోని పలు దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. కోట్లాది రూపాయల అస్తినష్టం సంభవించింది.