ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి ధాటికి బయటకు వెళ్లలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈనెల 18-21 మధ్య రుతుపవనాలు విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని.. తద్వారా 19వ తేదీ నుంచి ఏపీలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోస్తాంధ్రలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa