కాంగ్రెస్ పార్టీలో చేరడం కన్నా.. బావిలో దూకి చావడమే మేలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. బీజేపీ 9 ఏళ్ల పాలనపై మహారాష్ట్రలోని బాంధ్రలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గడ్కరీ తన రాజకీయ జీవితం తొలినాళ్ల విషయాలను పంచుకున్నారు. దివంగత కాంగ్రెస్ నేత శ్రీకాంత్ జిచ్కర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరారన్నారు. అప్పుడు ఆ ఆఫర్ను తిరస్కరించి.. కాంగ్రెస్లో చేరడం కంటే బావిలో దూకి చావడమే మేలని చెప్పినట్లు గడ్కరీ పేర్కొన్నారు.