సిక్కింలో కుంభవృష్టిగా వర్షం కురుస్తోంది. దీంతో ఆకస్మిక వరదలు పోటెత్తడంతో 2 వేలకుపైగా పర్యాటకులు చిక్కుకుపోయారు. వారిలో 1,975 మంది దేశీయ పర్యాటకులు, 36 మంది విదేశీయులు ఉన్నారు. గురువారం నుంచి ఉత్తర సిక్కింలోని మంగాన్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. పెంగాంగ్ సప్లయ్ ఖోలా వద్ద మంగాన్ జిల్లా కేంద్రం నుంచి చుంగ్‌థాంగ్ వెళ్లే రోడ్డును వరద ముంచెత్తింది. 345 కార్లు, 11 బైకులు బురుదలో కూరుకుపోయాయి.