నాడు నేడు క్రింద ఆసుపత్రుల అభివృద్ధికి మంజూరైన పనులను వేగంగా పూర్తి చేసి సంబంధిత వైద్యులకు అప్పగించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. అందుబాటులో నున్న నిధులకు తగ్గట్టుగా పనులకు ప్రాధాన్యతనిచ్చి అత్యంత అవసరమైన వాటిని ముందుగా పూర్తి చేయాలన్నారు. శుక్రవారం విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పి. హెచ్. సి , ఏరియా ఆసుపత్రి, వైద్య కళాశాల పనుల పై ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. పిహెచ్ సి , ఏరియా ఆసుపత్రుల మరమ్మత్తులకు కేటాయించిన నిధులు అందుబాటు లో ఉన్నాయని, లేబర్ ప్రణాళిక వేసుకొని, సిమెంట్, ఇతర సామగ్రిని ఏర్పాటు చేసుకోవలని తెలిపారు. ఓ. పి నడపడానికి వీలుగా తొలుత ఎక్విప్మెంట్, లేబ్, టాయిలెట్స్, విద్యుత్, ఆసుపత్రులకు వాహనాలు వెళ్ళుటకు అప్ప్రోచ్ రహదారులు తప్పకుండా ఉండాలని న్నారు. వచ్చే నెల లోగా ఈ వసతులను పూర్తి చేయాలన్నారు.
మరమ్మత్తులు , నిర్మాణాలు పూర్తి అయిన వాటిని వెంటనే ప్రారంభించాలని , ప్రహరి గోడలు పూర్తి కాలేదని ప్రారంభాలు పెండింగ్ ఉంచకూడదని అన్నారు. అదే విధంగా బిల్లులను కూడా వెంటనే అప్లోడ్ చేయాలనీ అన్నారు. ఇటీవల తన పర్యటనలో భాగంగా రామభద్రాపురం పి. హెచ్. సి తనిఖీ చేయడం జరిగిందని, అయితే అక్కడ లేబర్ రూమ్ లో రున్నింగ్ టాయిలెట్ లేదని, టాయిలెట్ కు తలుపు లేదని, కనేసం లైట్ కూడా లేదని, ఇలా అయితే సర్జరీ లు జరిగేదేలా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏ ఏ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలో ఇంజనీరింగ్ అధికారులకు కనీస పరిజ్ఞానం ఉండాలన్నారు. ఆర్ అండ్ బి ఎస్ ఈ, ఈ ఈ లు వారం లోగా అన్ని పనులను వ్యక్తిగతంగా తనిఖీ చేయాలన్నారు. కనీస అవసరాలకు ప్రాధాన్యత నిచ్చి పనులు వేగంగా జరగాలన్నారు. వెళ్ళే ముందు సంబంధిత వైద్యునికి సమాచారం ఇవ్వాలని, వైద్యునితో కలసి నిదులెంత ఉన్నది, ఆ నిధులతో ఏ ఏ పనులు చేపట్టవచ్చో చర్చించుకొని చేపట్టాలన్నారు. మెడికల్ కళాశాల పనుల పై సమీక్షిస్తూ పెయింటింగ్ వేయుటకు పెయింటర్లను సంఖ్య పెంచాలని, అదే విధంగా మేషన్స్ సంఖ్య కూడా పెంచాలని, త్వరగా ముగింపు పనులను పూర్తి చేయాలనీ ఆదేశించారు.