పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులపై దేశ ద్రోహం (ఉపా) కేసును వెంటనే ఉపసంహరించాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. అభ్యుదయ భావాలతో, ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, ప్రభుత్వానికి తగిన సూచనలు చేస్తున్న హరగోపాల్‌కు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే నెపంతో తెలంగాణ ప్రభుత్వం ఆయనపై దేశద్రోహం కేసును బనాయించడం అప్రజాస్వామికమని 10 వామపక్ష పార్టీలు ఖండించాయి. సుప్రీం కోర్టు అభిశంసించిన దేశద్రోహ చట్టాన్ని పూర్తిగా ఉపసంహరించాలని ఆ పార్టీల రాష్ట్ర నేతలు డిమాండ్ చేశారు.