రామచంద్రపురం పురపాలక సంఘం పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా స్థానికంగా వస్తున్న సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ తెలిపారు.
సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక 3వ వార్డులో గడపగడపకు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గడపగడపకు తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై లబ్ధిదారుల నుండి స్పందనను తెలుసుకున్నారు. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాలు కుల, మతం భేదం లేకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలు , వార్డు సభ్యులు తమకు ఉన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అందులో భాగంగా డ్రైనేజీ సమస్యలతో పాటు రోడ్లు సమస్య గురుంచి విద్యుత్తు లైట్లు పై మంత్రి దృష్టికి తీసుకురాగా డ్రైనేజీ సమస్య పరిష్కరించి తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో రామచంద్రపురం పురపాలక సంఘం చైర్ పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ కే శ్రీకాంత్ రెడ్డి, అధికారులు లతోపాటు, 3వ వార్డు కౌన్సిలర్ ఇంచార్జీ శ్రీనివాస్, ఇతర కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.