వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే 7వ ముద్దాయిగా వైఎస్ భాస్కర్ రెడ్డి, 8వ ముద్దాయిగా వైఎస్ అవినాశరెడ్డి ఉన్నారు. ఇంకా ఎంత మంది ‘వైఎ్స’లు వస్తారన్నది త్వరలో బయటపడుతుంది అని బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. ‘‘సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డిని ఇంట్లో చంపించి... రోజుకో కథ చెప్పి అంతులేని కథగా మార్చారు. ఈ అంతులేని కథ జూలై 3న సుప్రీం కోర్టులో చీఫ్ జస్టిస్ బెంచ ముందు అంతం కానుంది. వివేకానందరెడ్డి హత్య గురించి జగనకు ముందే తెలుసు. వివేకా కేసులో సీబీఐ విచారణ గడువు పెంచుతారు. అడ్డువచ్చినవారిని పంపించేసే రకమే వైఎస్ కుటుంబం. పవన్ ఎదిగితే తట్టుకుంటారా? అందులో బీజేపీతో అంటే ఇంక అంతే. సుపారీ, గంగిరెడ్డి, పులివెందుల బ్యాచ్... ఎవరు వస్తారనేది తెలియదు? పవన్ భద్రత విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని y కేటరీ భద్రత కల్పించాలి’’ అని ఆదినారాయణ తెలిపారు.