విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులు, ఆడిటర్ జి.వెంకటేశ్వరరావు (జీవీ) సోమవారం విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఇటీవల ఎంపీ కుమారుడు శరత్, భార్య జ్యోతి, ఆడిటర్ జీవీలను ఒక ముఠా రుషికొండలో గృహ నిర్బంధం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాలన్నీ వివరించేందుకు వీరంతా సీఎంను కలిశారు. నిందితులు చాలా దారుణంగా వ్యవహరించారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు.