స్టాక్ మార్కెట్లు నేడు లాభాలో ముగిసాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 159 పాయింట్లు లాభపడి 63,328 వద్ద ముగిసింది. నిఫ్టీ 61 పాయింట్లు పుంజుకుని 18,817 వద్ద కొనసాగుతోంది. పవర్, ఆటో, ఐటీ, టెలికాం, టెక్ తదితర సూచీలు లాభపడగా, ఫైనాన్స్, హెల్త్ కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ తదితర సూచీలు నష్టపోయాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : టాటా మోటార్స్ (3.10%), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (2.69%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.45%), టెక్ మహీంద్రా (1.28%), ఎన్‌టిపిసి (1.00%).
టాప్ లూజర్స్ : బజాజ్ ఫైనాన్స్ (-1.86%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.18%), సన్ ఫార్మా (-0.96%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.51%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.41%).