సబ్బవరం మండలంలోని మొగలిపురం గ్రాములో బుధవారం ప్రజలకు సమాజంలో జరుగుయున్న నేరాల బారిన పడకుండా ఉండేందుకు ప్రజలకు స్థానిక పోలీస్ యంత్రాంగం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనకాపల్లి జిల్లా ఎస్ పి, దిశ సి ఐ ల ఆదేశాల మేరకు సి ఐ రంగనాధం, ఎస్ ఐ సురేష్ మండలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలను చైతన్య పరిచారు. గ్రామంలో సంచార వేన్ ఏర్పాటు చేసి టీవీ ద్వారా బాల్యవివాహాలు, దొంగతనం, మోసం, స్త్రీలపై అసభ్యంగా ప్రవర్తించడం, వరకట్న వేధింపులకు ఆడవారిని గురి చేయడం మొదలగు ఐ పి సి సెక్షన్ లకు సంబంధించి లఘు చిత్రాలను ప్రదర్శించి అటువంటి సందర్భాలలో అప్రమత్తంగా ఉండేందుకు ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు అంగటి నాని యువకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa