చైనాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వాయువ్య చైనాలోని నింగ్జియా ప్రాంతంలో గ్యాస్ పేలింది. ఈ ప్రమాదంలో 31 మంది మృతిచెందారు. ఓ రెస్టారెంట్ లో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. లిక్విడ్ పెట్రోలియం లీక్ కావడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa