రాష్ట్రంలోని పీఎం కిసాన్ లబ్ధిదారులు తప్పకుండా ఈకేవైసీ చేయించుకోవాలని, ఇప్పటివరకు చేయించుకోని వారు ఈ నెలాఖరులోగా తప్పనిసరిగా చేయించుకోవాలని వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ సూచించారు. బయోమెట్రిక్ తో పాటు ఈసారి ఫేస్ అథంటికేషన్ కోసం మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. వేలి ముద్రలు పడనివారు, ఆధార్-ఫోన్ నెంబర్ లింక్ కానివారు ఈ ఫేస్ అథంటికేషన్ యాప్ ద్వారా ఈ కేవైసీ చేసుకోవచ్చని తెలిపారు.