మంగళగిరిలో టీడీపీ జాతీయ కార్యాలయంలో ఈనెల 27న జరగబోయే మాలల ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని టీడీపీ ఎస్సీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు మహాసేన రాజేష్ పిలుపునిచ్చారు. గురువారం తునిలో టీడీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు సమక్షంలో ఎస్సీ నేతలకు ఆహ్వానపత్రికను అందించారు. రాజేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న మాలలకు కొన్ని కారణాలను బూచిగా చూపించి టీడీపీకి దూరం చేయాలని గత ఎన్నికల్లో కుట్ర చేశారని, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కూడా అదేపనిలో వైసీపీ ఉందని వాటిని తిప్పికొట్టేందుకు మాలల ఆత్మీయ సభను ఏర్పాటుచేశారన్నారు. గత ఎన్నికల్లో మోసపోయినట్లుగా ఇక జగన్ను నమ్మి మోసపోయే పరిస్థితులు లేవన్నారు. కార్యక్రమంలో తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు యనమల శివరామకృష్ణన్, ఎస్సీ నా యకులు దిబ్బ శ్రీను, లంక సునీల్ బోడపాటి అప్పారావు, దిబ్బ గోవిందు, బోడపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.