కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం విద్యా మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహించారు. విద్యా మంత్రుల సమావేశంలో G20 దేశాలు, ఆహ్వానిత దేశాల మంత్రులు మరియు UNICEF, UNESCO మరియు OECD వంటి అంతర్జాతీయ సంస్థల సీనియర్ అధికారులతో కూడిన నూట యాభై మంది G20 ప్రతినిధులు పాల్గొన్నారు. జీ20 విద్యా మంత్రుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు.విద్య మరియు నైపుణ్యాభివృద్ధిలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు 4వ ఎడిడబ్ల్యుజి సమావేశంలో పలు ద్వైపాక్షిక సమావేశాలు కూడా జరిగాయి. విద్య అనేది మన నాగరికతకు పునాది మాత్రమే కాదు, మానవాళి భవిష్యత్తుకు రూపశిల్పి కూడా అని ప్రధాని నరేంద్ర మోదీ తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.ప్రధాన మంత్రి విద్యా మంత్రులను షెర్పాలుగా ప్రస్తావిస్తూ, అభివృద్ధి, శాంతి మరియు అందరి శ్రేయస్సు కోసం మానవజాతిని దాని ప్రయత్నంలో వారు నడిపిస్తున్నారని అన్నారు.