కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టి ఏపీలో కాంగ్రె్‌సకు పూర్వ వైభవం తీసుకొస్తామని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. చిత్తూరులో గురువారం జరిగిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ల్యాండ్.. శ్యాండ్.. లిక్కర్ మాఫియా చెలరేగిపోతోందన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి జరుగుతున్న పరిస్థితి కనపడలేదన్నారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో హత్యలు, రేప్‌లు, కిడ్నా్‌పలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తంచేశారు. శాంతిభద్రతల క్షీణతకు రెపల్లెలో ఇటీవల జరిగిన 14 ఏళ్లబాలుడిని సజీవ దహనం చేయడమే నిదర్శనమన్నారు. ఈ ఘటనలో ఇంత వరకు నిందితులను పట్టుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఆ కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం, కుటుంబీకులకు ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండు చేశారు. ఈ ఘటనపై మానవహక్కుల సంఘానికి, చైల్డ్ కమిషనకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఆ ఘటన మరవక ముందే బందరులో ఓ అమ్మాయిపై అఘాయిత్యం జరిగిందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో జిల్లాకు అనేక నీటిపారుదల ప్రాజెక్టులు తీసుకొచ్చామని వివరించారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించిన ఘనత కూడా కాంగ్రె్‌సదే అన్నారు. అధికారంలోకి వస్తే విజయా డెయిరీని తెరిపిస్తానని హామీ ఇచ్చిన జగన్.. ఇప్పుడు అమూల్‌కు కట్టబెట్టడం సరికాదన్నారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేదన్నారు. అలాంటి పార్టీకి జగన్ మద్దతు పలకడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి మెయ్యప్పన్, తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్, వర్కింగ్ ప్రెసిడెంట్లు జంగా గౌతమ్, రాకేష్ రెడ్డి, నాయకులు టిక్కి రాయల్, పూర్ణచంద్రరావు, విక్టోరియా తదితరులు పాల్గొన్నారు.