సీఎం జగన్ జూలై 5న చిత్తూరు జిల్లా పర్యటనకు వస్తున్నట్లు అనధికారికంగా తెలిసింది. తిరుపతి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఉదయం 10 గంటలకు చీలాపల్లి సీఎంసీకి చేరుకొని శంకుస్థాపన చేస్తారు. అక్కడ్నుంచి రోడ్‌షోగా బయలుదేరి కలెక్టరేట్ సమీపంలో వైఎస్ విగ్రహానికి నివాళులర్పిస్తారు. అనంతరం విజయా డెయిరీ ప్రాంగణానికి చేరుకుని అమూల్ సంస్థకు డెయిరీ అప్పగించే అంశంపై భూమిపూజ, శిలాఫలకం ఏర్పాటు చేసే అకశాలున్నాయి. అనంతరం వేలూరురోడ్డులో నిర్మించిన బీసీ భవన్‌ను ప్రారంభిస్తారు. పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాల మైదానంలో జరిగే సభలో ప్రసంగిస్తారని తెలిసింది. సీఎం పర్యటనకు పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ షన్మోహన్ గురువారం జిల్లా అధికారుల సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో జేసీ శ్రీనివాసులు, ట్రైనీ కలెక్టర్ మేఘస్వరూప్, డీఆర్వో రాజశేఖర్, జిల్లా అధికారులు, ఆర్డీవోలు పాల్గొన్నారు.