టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్రలో భాగంగా గురువారం వెంకటగిరి మండలంలో పర్యటించారు.ఈ సందర్భంగా పాతబస్టాండు కూడలిలో జరిగిన సభలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు.వెంకటగిరికి జగన్ అనేక హామీలు ఇచ్చాడని,అయితే ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదని ఆరోపించారు. ‘ఎస్ఎస్ కెనాల్ పనులు పూర్తిచేసి వెంకటగిరి, డక్కిలి, రాపూరు మండలాలకు సాగునీరు ఇస్తామన్నాడు. ఆగిపోయిన బీహెచ్ఈఎల్ కంపెనీని పూర్తిచేస్తామన్నాడు. వెంకటగిరి నుంచి నాయుడుపేటకు వెళ్లే దారిలో రైల్వే బ్రిడ్జి పూర్తిచేస్తామన్న జగన్ ఏ హామీనీ నెరవేర్చలేదు.టీడీపీ హయాంలోనే వెంకటగిరి అభివృద్ధి జరిగింది. 2014 నుంచి 2019 వరకు రూ.3వేల కోట్లు టీడీపీ ప్రభుత్వం ఖర్చుపెట్టింది. సీసీరోడ్లు, పేదలకు టిడ్కో ఇళ్లు, సాగు, తాగునీటి ప్రాజెక్టులు టీడీపీ నిర్మించింది.’ అని లోకేశ్ గుర్తు చేశారు.