ఇటీవల అనారోగ్యంతో మరణించిన ఏఆర్ కానిస్టేబుల్ బి.రామక్రిష్ణ (ఎఆర్పీసీ 3085) కుటుంబానికి గురువారం కడప ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ రూ.2.75 లక్షల ఆర్థిక సాయం చెక్కు రూపంలో అందించారు. ఇందులో పోలీసు వితరణ నిధి కింద రూ.2లక్షలు, విడో ఫండ్ కింద రూ.50వేలు, ప్లాగ్ ఫండ్ నుంచి రూ.25వేలు కలిపి రామక్రిష్ణ సతీమణి బి.నాగలక్ష్మికి జిల్లా పోలీసు కార్యాలయంలో అందించారు. పిల్లల చదువులకు, కుటుంబానికి తాము అండగా ఉంటామని ఎస్పీ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) తుషార్ డూడి, డీపీఓ ఏఓ ఎన్.జ్యోతి, జూనియర్ అసిస్టెంట్ మహజబీన్, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, జాయింట్ సెక్రటరీ రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.