ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయంలో పనిచేస్తున్న రికార్డ్ అసి స్టెంట్ నుంచి ఏఈవో స్థాయి సిబ్బందికి రొటేషన్ పద్ధతిలో విధులను కేటాయించనున్నారు. ఈ మేరకు దేవదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యన్నారాయణ గురువారం సర్క్యులర్ జారీచేశారు. ఇది రాష్ట్రంలోని 6(ఏ) కేడర్, ప్రధాన దేవాల యాల్లో పనిచేస్తున్న వారికి వర్తిస్తుందని పేర్కొన్నారు. ఒకే చోట ఏళ్ల తరబడి సిబ్బంది పాతుకు పోవడం వల్ల పలు ఆరోపణలు వస్తున్నట్లు గుర్తించారు. ఇంజనీరింగ్ సిబ్బందిని మినహాయించి ఏఈఓలు, సూపరింటెండెంట్‌లు, సీని యర్, జూనియర్, రికార్డు అసిస్టెంట్‌లను ప్రతీ మూడు నెలలకోసారి రొటేషన్ పద్ధతిన విధుల్లో మార్పుచేయాలని సూచించారు. నాలుగో తరగతి, కౌంటర్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందికి ఇదే పద్ధతి వర్తిస్తుంది.