ప్రజల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని నూజివీడు సబ్ కలెక్టర్, మండల స్పెషల్ ఆఫీసర్ ఆదర్ష్ రాజీంద్రన్ అన్నారు. మండల కార్యాలయం లో గురువారం జగనన్న సురక్షపై అన్నిశాఖల అధికారులకు అవగాహన కార్యాక్ర మాన్ని ఎంిపీడీవో జి.రాణి అధ్యక్షతన నిర్వహించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ ప్రత్యేక అధికారులు, గృహాసారఽథులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్‌లు, కన్వీనర్‌లకు జగనన్న సురక్షలో పొందుపరిచిన 11 అంశాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. వలంటీర్‌లుప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను ఆర్జీల రూపంలో తీసుకోవడంతో పాటు, యాప్‌లో పొందుపరచాలని సూచించారు. జూలై 3 నుంచి 23 వరకు గ్రామసభలు జరుగుతాయని, ప్రజల సమస్యలను గ్రామసభల్లో పరిష్క రించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్ దాసరి సుధ, ఎస్‌ఐ ఎం.కుటుంబరావు, ఈవోపీఆర్డీ బి.ఎ.సత్యనారాయణ పాల్గొన్నారు.