ఏలూరు జిల్లా, దెందులూరు మండలం దోసపాడు గ్రామానికి చెందిన దారం నాగబాబును అదే గ్రామానికి చెందిన మందపాటి మనోజ్ సిగరెట్ ఇవ్వాలని గురువారం గ్రామ సెంటర్లో అడిగాడు. వారిద్దరి మధ్య ఘర్షణ జరగడంతో కొట్టుకున్నారు. తర్వా త మనోజ్ ఇంటి మీదుగా గేదెలను తోలుకు రావడానికి వెళుతున్న నాగబాబుకు, మనోజ్ మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో రెండు వైపుల వారు వర్గాలుగా ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. దాడుల్లో నాగబాబు అతను సోదరుడు కన్నయ్య, మరో వర్గానికి చెందిన మందపాటి మనోజ్, మౌళి, మందపాటి జానకి, పైడిమాల రాణి, మందపాటి ఎస్తేర్‌రాణి, స్వామి గాయపడ్డారు. వారు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఆసుపత్రి వద్ద గురువారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తిరిగి ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో టూ టౌన్ సీఐ చంద్రశేఖర్, సిబ్బంది స్పెషల్ పార్టీ పోలీసులు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వైసిపి నాయకుడు గంట ప్రసాద రావు ఆసుపత్రి వద్ద బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.